బిగ్ బాస్ 7 షకీలా బయోగ్రఫీ, మూవీస్, ఫామిలీ…

Bigg Boss

Updated on:

బిగ్ బాస్ 7 షకీలా బయోగ్రఫీ

1990 నుంచి ఇప్పటివరకు మొత్తం సౌత్ ఇండియా లో షకీలా అనే పేరు ఎంతో ఫేమస్. ఆవిడ చేసిన బి గ్రేడ్ మూవీస్ కు ఒకప్పుడు ఉండే క్రేజ్ అంత ఇంత కాదు. ముఖ్యంగా ఆవిడ సినిమాలు మలయాళం టాప్ హీరోస్ ఆయన మోహన్ లాల్ , మమ్ముట్టి లాంటి వారికి కూడా ధీటుగా ఉండేవి. ప్రస్తుతం షకీలా బిగ్ బాస్ 7 తెలుగు లో 6 వ కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్లారు. షకీలా బయోగ్రఫీ, మూవీస్, ఫామిలీ డీటెయిల్స్ క్లుప్తంగా …

బిగ్ బాస్ 7 షకీలా పర్సనల్ & ఫామిలీ డీటెయిల్స్

పూర్తి పేరు C షకీలా బేగం
పుట్టుక నవంబర్ 19 , 1973
పుట్టింది కోడంబాక్కం, మద్రాస్
సొంత ఊరు గుంటూరు
తల్లి చాంద్ బేగం
తల్లి చాంద్ బాషా
బ్రదర్ సలీం
సిస్టర్ నూర్జహాన్
పెళ్లి కాలేదు

బిగ్ బాస్ 7 షకీలా ఎర్లీ లైఫ్ & ఎడ్యుకేషన్

షకీలా పుట్టింది ఒక ముస్లిం కుటుంబంలో. ఆమె కుటుంబ పరిస్థితులు సరిగ్గా లేకపోడం తో ఆమె చదువుని కూడా మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఆమె టెన్త్ క్లాస్ పరీక్షలు కూడా రాయకుండా చదువు మధ్యలోనే ఆపేసింది. ఆమె తన 16వ ఏటనే యాక్టింగ్ కెరీర్ మొదలుపెట్టింది. హిందీ చిత్రం ” ఆకరి గులాం ” లో చిన్న పాత్ర లో కనిపించింది.

తరువాత కొన్ని ఏళ్ళు చిన్న పాత్రలు చేసిన షకీలా సిల్క్ స్మిత తో కలిసి 1995 లో ” ప్లే గర్ల్స్ ” అనే మూవీ లో లీడ్ రోల్ చేసే అవకాశం కొట్టేసింది. కిన్నర తుంబికల్ (2000) లో ఆమె యాక్టింగ్ తో అందరి దృష్టిలో పది మంచి పేరు తెచ్చుకుంది. ఆ తరువాత ఆమె సాఫ్ట్ పోర్న్ మూవీస్ ఎక్కువగా చేసేవారు. అవి చైనీస్, నేపాలీ, వంటి భాషల్లో కూడా అనువాదించబడ్డాయి.

బిగ్ బాస్ 7 షకీలా మూవీస్ & కెరీర్

షకీలా తన కెరీర్ లో ఇప్పటివరకు సుమారు 500 వరకు చిత్రాల్లో నటించారు. ఆవిడ అధికంగా మలయాళం చిత్రాల్లోనే నటించినప్పటికీ అవి అన్ని సౌత్ ఇండియా భాషల్లో కూడా విడుదలయ్యేవి. ఆవిడ తెలుగులో నటించిన మొట్టమొదట సినిమా ” నయీమ్ & షకీలా “.

ఆమె తెలుగులో ” సౌందర్య లహరి, తొట్టి గ్యాంగ్, జయం, నిజం, పుట్టింటికి రా చెల్లి, దొంగోడు, బంగారం, కొబ్బరి మట్ట ” లాంటి హిట్ చిత్రాల్లో కనిపించారు. 2012 తర్వాత ఆమె ఎలాంటి బి బ్రాడ్ మూవీస్ లో నటించబోనని షకీలా ప్రకటించారు.

షకీలా గత కొన్ని సంవత్సరాల నుంచి సౌత్ ఇండియన్ మూవీస్ లో కామెడీ రోల్స్ చేస్తున్నారు. తెలుగు డైరెక్టర్ తేజ గారు షకీలా కి తన మూవీస్ లో కామెడీ రోల్స్ తో అవకాశం ఇచ్చేవారు. ఆయన తీసిన జయం, నిజం సినిమాల్లో షకీలా గారికి మంచి రోల్స్ ఇచ్చారు.

బిగ్ బాస్ 7 షకీలా unknown facts

  • షకీలా పెళ్లి చేసుకోలేదు, ఆమె ఒక transgender ని దత్తతు తీసుకున్నారు. పేరు mila.
  • డబ్బు వ్యామోహం లో పది తన తల్లే బి గ్రేడ్ ఫిలిమ్స్ లో నటించామనేది అని ఆవిడ తన ఆత్మ కథ (shakeela Aatmakatha) లో చెప్పారు.
  • షకీలా మార్చ్,2021 లో నేషనల్ కాంగ్రెస్ పార్టీ( NCP )లో చేరారు.
  • టాప్ లెస్ సీన్స్ చేయడానికి షకీలా తన డూప్ (సూరయ్య భాను) ని పెట్టుకుంది
  • షకీలా కు చెన్నై ఎక్ష్ప్రెస్స్ చిత్రంలో సత్య రాజ్ పక్కన నటించే అవకాశం వచ్చింది. ఆయన కొన్ని అనివార్య కారణాల వల్ల కుదరలేదు.
  • 2020 లో షకీలా పేరు మీద ఒక బయోపిక్ కూడా రిలీజ్ అయ్యింది. అందులో రిచ్ చెడ్డ (Rich Chadda) షకీలా పాత్ర పోషించారు.

బిగ్ బాస్ 7 నిఖిల్ విజయేంద్ర సింహ బయోగ్రఫీ

బిగ్ బాస్ 7 ఎపిసోడ్ 3 డే 2 హైలైట్స్

Web Story

Leave a Comment