బిగ్ బాస్ 7 కు వెళ్లబోయే కంటెస్టెంట్స్ వీళ్ళే …. Bigg Boss 7 Telugu Contestants

Bigg Boss

Updated on:

Bigg Boss 7 Telugu Contestants

బిగ్ బాస్ సీసన్ 7 తొందర్లోనే మొదలుకానుంది. మాకున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ 3వ తేదీన ఆదివారం సాయంత్రం బిగ్ బాస్ 7 తెలుగు స్టార్ట్ అవ్వనుంది. ఇప్పటికే రెండు ప్రోమోలను స్టార్ మా విడుదల చేసింది. గత 5 సీసన్స్ లాగానే ఈ సీసన్ కూడా కింగ్ నాగార్జున గారే హోస్ట్ గా వ్యవహరించనున్నారు.

ఈ 7వ సీసన్ లో మొత్తం 20 కంటెస్టెంట్స్ ఉండబోతున్నారని సమాచారం. ఇందులో సెలెక్ట్ ఆయన కంటెస్టెంట్స్ ఎవరు అన్నది దాదాపుగా తెలిసిపోయింది. అయితే వీరిలో ఎవరు వైల్డ్ కార్డు కంటెస్టెంట్ అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ బిగ్ బాస్ 7 కంటెస్టెంట్స్(Bigg Boss 7 Telugu Contestants) కేవలం మాకున్న సమాచారం ప్రకారం తెలియజెయ్యడం ఐనది. ఇది official లిస్ట్ కాదు. కానీ ఇందులో చాలావరకు Bigg Boss 7 Telugu Contestants గా వెళ్ళబోతున్నారు.

బిగ్ బాస్ 7 కు గాను నాగార్జున ఎంత రెమ్యూనరేషన్ తీస్కుంటున్నాడో తెలుసా?

బిగ్ బాస్ 7 కంటెస్టెంట్స్ – Bigg Boss 7 Telugu Contestants List

కంటెస్టెంట్ పేరువృత్తి
ఆట సందీప్డాన్స్ మాస్టర్
ఐశ్వర్య పిస్సేటీవీ యాక్ట్రెస్
అమర్దీప్ చౌదరిటీవీ యాక్టర్
అంబటి అర్జున్సీరియల్ యాక్టర్
భోలే షావలిసింగర్, మ్యూజిక్ డైరెక్టర్
దామినిసింగర్
ఫరజాణాయాక్ట్రెస్
గౌతమ్ కృష్ణయాక్టర్ & డైరెక్టర్
కిరణ్ రాథోర్యాక్ట్రెస్
క్రాంతిసీరియల్ యాక్టర్
నిఖిల్యూట్యూబర్
పల్లవి ప్రశాంత్రైతు
పవన్ సాయిటీవీ యాక్టర్
ప్రభాకర్టీవీ & సినిమా యాక్టర్
ప్రిన్స్ యావర్టీవీ యాక్టర్
ప్రియాంక జైన్సీరియల్ యాక్ట్రెస్
రతికయాక్ట్రెస్
షకీలాయాక్ట్రెస్
శివాజీయాక్టర్
శోభా శెట్టిమోడల్ & యాక్ట్రెస్
శుభ శ్రీయాక్ట్రెస్
టేస్టీ తేజకమెడియన్ & యూట్యూబర్

ఆట సందీప్

ఆట సందీప్ జీ తెలుగు ఛానల్ లో వచ్చిన ఆట షో ద్వారా అందరికి తెలుసు. MAA TV డాన్స్ షోస్ ఆయన ఛాలెంజ్ లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదే Star MAA లో ఇటీవల జరిగిన నీతోనే డాన్స్ అనే షో లో భార్య తో పాటు జంటగా వెళ్లి విజేతగా నిలిచాడు.

bigg boss 7 aata sandeep

 

ఐశ్వర్య పిస్సే

ఐశ్వర్య పిస్సే తెలుగు, తమిళ్,కన్నడ సీరియల్స్ లో యాక్ట్ చేసింది. తెలుగు లో ” అగ్ని సాక్షి, కస్తూరి, ముక్కు పుడక ” సీరియల్స్ లో నటించింది.

 

అమర్దీప్ చౌదరి

అమర్దీప్ చౌదరి తెలుగు టీవీ సీరియల్ యాక్టర్. స్టార్ మా లో ప్రసారమైన “జానకి కలగనలేదు” అనే సీరియల్ లో లీడ్ యాక్టర్ గా చేసాడు. అదే ఛానల్ లో నీతోనే డాన్స్ అనే డాన్స్ షో కి భార్య తేజస్విని తో జంటగా పార్టిసిపేట్ చేసాడు.

bigg boss 7 amardeep chowdary

 

అంబటి అర్జున్

పూర్తి పేరు నాగార్జున రెడ్డి అంబటి. అంబటి అర్జున్ తెలుగు సినిమా, సీరియల్ మరియు వెబ్ సిరీస్ నటుడు. ” అగ్ని సాక్షి (సీరియల్), హలో గురు ప్రేమకోసమే(వెబ్ సిరీస్), సౌఖ్యం, అశ్వమేధం, సుందరి, తీస్ మార్ ఖాన్ ” సినిమాల్లో నటించాడు.

బిగ్ బాస్ 7 అంబటి అర్జున్

 

భోలే షావలి

భోలే షావలి సింగర్ & మ్యూజిక్ డైరెక్టర్. ఎక్కువగా ఎవరికీ తెలియకపోయిన బిగ్ బాస్ లో అవకాశం వచ్చింది. ఈయన పడిన “Kastapadda palammina Mass Love Failure” సాంగ్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది.

bigg boss 7 bhole shavali

 

దామిని సింగర్

దామిని సింగర్ గా మాత్రమే కాకా తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం లో కూడా పలు సినిమాల్లో నటించారు. ఈమె బాహుబలి సినిమాలో పాడిన పచ్చబొట్టేసిన పాట ద్వారా మంచి పేరు తెచ్చుకుంది. ఇటీవల విడుదల ఆయన పవన్ కళ్యాణ్ గారి చిత్రం బ్రో (bro) లో థీమ్ అఫ్ బ్రో ( Theme of Bro ) పాత ని కూడా పాడారు.

bigg boss 7 damini batla

 

ఫరజాణా

డాన్సర్, కొరియోగ్రాఫర్ గా కెరీర్ మొదలుపెట్టిన ఫరజాణా తెలుగు లో భాగ్యలక్ష్మి బంపర్ డ్రా అనే చిత్రం ద్వారా తెలుగు సినిమాల్లో అరంగ్రేటం చేసింది. ఆ తరువాత ” సీమ శాస్త్రి, బొమ్మనా బ్రదర్స్ చందాన సిస్టర్స్ ” చిత్రాల ద్వారా సక్సెస్ ను అందుకుంది.

bigg boss 7 farzana actress

 

గౌతమ్ కృష్ణ

వృత్తి రీత్యా డాక్టర్ ఆయన సరే యాక్టింగ్ మీద ఉన్న ఇష్టం తో గౌతమ్ కృష్ణ ” ఆకాశ వీధుల్లో ” అనే చిత్రం ద్వారా తెలుగు లో అరంగ్రేటం చేసాడు. ప్రస్తుతం బిగ్ బాస్ 7 తెలుగులో కంటెస్టెంట్ గా వెళ్తున్నాడు.

bigg boss 7 gautham krishna

కిరణ్ రాథోర్

 కిరణ్ రాథోర్ ఎక్కువగా తమిళ్ సినిమాల్లో నటించారు. తెలుగులో నువ్వు లేక నేను లేను అనే మూవీ తో అరంగ్రేటం చేసి,తరువాత శ్రీరామ్, నాని, చెప్పవే చిరుగాలి, హై స్కూల్ లాంటి సినిమాల్లో కనిపించారు.

bigg boss 7 kiran rathore

క్రాంతి

క్రాంతి తెలుగు సినిమా మరియు సీరియల్ నటుడు. తెలుగులో జీ తెలుగు లో వచ్చే ” no.1 కోడలు ” అనే సీరియల్ లో, అలాగే ” సవ్యసాచి, ఫస్ట్ రాంక్ ” రాజు తదితర చిత్రాల్లో నటించాడు.

bigg boss 7 kranthi

మోహన భోగరాజు

మోహన భోగరాజు తెలుగు సినిమా ప్లేబాక్ సింగర్. ఆమె ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడారు. అందులో “బాహుబలి-1 లో మనోహరి, అరవింద సామెత లో రెడమ్మ తల్లి, వకీల్ సాబ్ లో మగువ మగువ (ఫిమేల్ వెర్షన్)” ఇంకా మరెన్నో బ్లాక్బూస్టర్స్ సాంగ్స్ పాడారు.

bigg boss 7 mohana bhogaraju

 

నిఖిల్

నిఖిల్ ఒక ప్రముఖ యూట్యూబర్. తన ఛానల్ లో ప్రముఖ సెలబ్రిటీస్ తో ఇంటర్వూస్, ఫన్నీ గేమ్స్, ప్రాంక్స్ చెయ్యడం ద్వారా ఫేమస్ అయ్యాడు.

Bigg Boss 7 Telugu nikhil 1

 

పల్లవి ప్రశాంత్

పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ లో కామన్ మాన్ క్యాటగిరి లో ఎంపిక అయ్యాడు. రైతు గా ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ లో వీడియోస్ చేస్తూ బిగ్ బాస్ కు వెళ్లాలనే తన ఆకాంక్ష ను తెలియజేస్తూ ఉండడం తో బిగ్ బాస్ లోకి సెలెక్ట్ అయ్యాడు.

bigg boss 7 pallavi prasanth

 

పవన్ సాయి

తెలుగు సీరియల్స్ చూసే ప్రతివాళ్ళకి పవన్ సాయి చాల సుపరిచుతుడు. జెమినీ టీవీ లో ప్రసారమైన బ్లాక్బస్టర్ సీరియల్ మొగలిరేకులు సీరియల్ లో పవన్ సాయి కి కూడా ఒక ముఖ్య పాత్ర ఉంది. అదే కాకా హిట్ సీరియల్స్ ఆయన ” హ్యాపీ డేస్, తీరం, శ్రావణ సమీరాలు ” లో నటించాడు.

bigg boss 7 pavan sai

 

ప్రభాకర్ యాక్టర్

బుల్లితెర మెగాస్టార్ గా పేరు గాంచిన ఈటీవీ ప్రభాకర్ తెలుగు సీరియల్ ప్రేమికులకు చాల సుపరిచితుడు. గత 30 సంవత్సరాలుగా సీరియల్స్ లో, అడపాదడపా చిత్రాల్లో కూడా నటిస్తున్న ప్రభాకర్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లనున్నారు.

bigg boss 7 prabhakar actor

 

ప్రిన్స్ యావర్

ప్రిన్స్ యావర్ ఒక మోడల్ మరియు సీరియల్ యాక్టర్. ప్రిన్స్ యావర్ తెలుగు లో నా పేరు మీనాక్షి అనే ఈటీవీ సీరియల్ లో సన్నీ రోల్ లో కమెడియన్ లా డెబ్యూ చేసాడు. తరువాత “హిట్లర్ గారి పెళ్ళాం,అభిషేకం, కలిసి ఉంటె కలదు సుఖం” లాంటి సీరియల్స్ లో కూడా కనిపించాడు.

bigg boss 7 prince yawar

 

ప్రియాంక జైన్

ప్రియాంక జైన్ తెలుగు, హిందీ, తమిళ్ సీరియల్స్, సినిమాల్లో నటించారు. మౌన రాగం అనే సీరియల్ ద్వారా ఫేమస్ అయ్యారు. మా టీవీ లో జానకి కలగనలేదు అనే సీరియల్ లో లీడ్ రోల్ లో ఆక్ట్ చేసారు. నీతోనే డాన్స్ అనే డాన్స్ షో లో కాబోయే భర్త శివ కుమార్ తో కలిసి పార్టిసిపేట్ కూడా చేసింది.

bigg boss 7 priyanka jain

 

రతిక

రతిక రోజ్ తెలుగు సినిమా యాక్ట్రెస్. ఆమె కెరీర్ లో చిన్న చిన్న పాత్రలతో పాటు ” నేను స్టూడెంట్ సర్ ” అనే మూవీ లో పోలీస్ ఆఫీసర్ రోల్ చేసింది. అది కాకుండా ” బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది ” అనే సినిమా లో కూడా కనిపించరు.

bigg boss 7 rathika rose

 

షకీలా

షకీలా ఇప్పటివరకు తెలుగు, తమిళ్, కన్నడ సినిమాలు, b గ్రేడ్ మూవీస్ లో యాక్ట్రెస్. ఒకప్పుడు షకీలా సినిమాలకు ఉన్న క్రేజ్ చాలా ఎక్కువ. ఆవిడ పొలిటికల్ గా కూడా కాంగ్రెస్ పార్టీ లో ఉండేవారు. ఆవిడ 18 సంవత్సరాల వయసులోనే యాక్టింగ్ ఫీల్డ్ లోకి వచ్చారు.

bigg boss 7 shakeela

 

శివాజీ

శివాజీ తెలుగు సినిమా యాక్టర్ గా అందరికి తెలుసు. ఖుషి, ఇంద్ర వంటి బ్లాక్బూస్టర్స్ లో కూడా నటించాడు. అంతే కాకా హీరో నితిన్ కెరీర్ మొదట్లో చేసిన సినిమాలు జయం, దిల్ లో నితిన్ కు డబ్బింగ్ కూడా చెప్పాడు. రాజకీయాల్లో కూడా ప్రస్తుతం ఆక్టివ్ గా ఉంటున్నాడు.

bigg boss 7 shivaji

 

శోభా శెట్టి

శోభా శెట్టి తెలుగు, కన్నడ సీరియల్స్ లో నటించింది. తెలుగు లో కార్తీక దీపం సీరియల్ లో ప్రతినాయకి పాత్రా ద్వారా తెలుగు ప్రేజలకు చాల దగ్గరయింది. ఇప్పుడు బిగ్ బాస్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి వెళ్లనుంది.

bigg boss 7 shobha shetty

 

శుభ శ్రీ

శుభ శ్రీ తెలుగు మరియు కన్నడ యాక్ట్రెస్. యాక్ట్రెస్ కాకముందు మోడల్, ఫెమినా మిస్ ఇండియా ఒడిశా( Femina Miss India Odisha ). 2022 లో వచ్చిన అమిగోస్ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ రోల్ చేసింది.

bigg boss 7 subha sree

 

టేస్టీ తేజ

టేస్టీ తేజ కెరీర్ ని జబర్దస్త్ తో మొదలుపెట్టాడు. తరువాత సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టి ఫుడ్ వీడియోస్ చేస్తున్నాడు. తన ఛానల్ లో చాలామంది సెలబ్రిటీస్ ప్రొమోషన్స్ లో భాగంగా రావడం వలన ఫేమస్ అయ్యాడు.

bigg boss 7 tasty teja

 

 

Bigg Boss 7 Telugu – బిగ్ బాస్ 7 తెలుగు

బిగ్ బాస్ 7 ఎపిసోడ్ 1 తెలుగు హైలైట్స్…

బిగ్ బాస్ 7 తెలుగు కోసం పూర్తి వివరాలు కోసం మా బ్లాగ్ ని ఫాలో అయ్యి notifications on లో ఉంచుకోండి. అలాగే మా ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్ పేజెస్ ని కూడా ఫాలో అవ్వగలరు.

Leave a Comment