బిగ్ బాస్ 7 ఎపిసోడ్ 3 డే 2 వాచ్ ఫ్రీ 05/09/2023

Bigg Boss

బిగ్ బాస్ 7 ఎపిసోడ్ 3 హైలైట్స్

బిగ్ బాస్ 7 తెలుగు లో రెండవ రోజు నామినేషన్స్ తోనే గడిచిపోయింది. మొదటి రోజు మొదలుపెట్టిన నామినేషన్స్ కంటిన్యూ చేయడం జరిగింది. ముందుగా శోభా శెట్టి ని ఆక్టివిటీ రూమ్ లోకి రమ్మని పిలిచారు. శోబాశెట్టి తన నామినేషన్స్ గా గౌతమ్ కృష్ణ, కిరణ్ రాథోడ్ పేర్లని చెప్పింది. దానికి కారణాలుగా కిరణ్ రాథోడ్ కి తెలుగు సరిగ్గా రాకపోడం తో ఇబ్బంది పడుతున్నట్టు, అలాగే గౌతమ్ తో తనకి అంతగా బాండింగ్ ఏర్పడలేదని కారణాలుగా తెలిపింది.

శోభా శెట్టి నామినేషన్స్

శోభా శెట్టి గౌతమ్ కృష్ణ, కిరణ్ రాథోడ్ లను నామినేట్ చేసింది. కిరణ్ కు ఉన్న బాషా ప్రాబ్లెమ్ వాళ్ళ కంటెస్టెంట్స్ తో మాట్లాడడానికి ఇబ్బంది పాడుతుంది అని, అలాగే గౌతమ్ తో తనకి ఎలాంటి బాండింగ్ ఇప్పటివరకు కుదరలేదని అందుకే వీళ్ళిద్దర్నీ నామినేట్ చేస్తునట్టు తెలిపింది.

దామిని నామినేషన్స్

దామిని రతిక, శోభా శెట్టి ని తన నామినేషన్స్ గా తెలిపింది. దామిని రాత్రి అంత నీడేది పోకపోడం తో చాలా డల్ గా ఉన్నట్టు అనిపించిందని, అలాగే ఇద్దరు కిచెన్ లో అంతగా సాయం చెయ్యకపోడం తనకి నచ్చలేదని తెలిపింది. దానికి రతిక, శోభా ఇద్దరు ఒప్పుకోలేదు. దామిని చూడనప్పుడు శోభా కిచెన్ లో పనులు చేసిందని వాదించింది.

ప్రిన్స్ యావర్ నామినేషన్స్

షకీలా, గౌతమ్ ను తన నామినేషన్స్ గా ప్రిన్స్ ప్రకటించాడు. షకీలా తనతో మాట్లాడిన విధానం తనకి నచ్చలేదని ప్రిన్స్ చెప్పాడు. అలాగే జిమ్ విషయం లో తేజ చెప్పిందాన్ని నమ్మి గౌతమ్ తనని ఏదో అన్నాడని గౌతమ్ పేరు ని కూడా చెప్పాడు.

సందీప్ నామినేషన్స్

రతిక, ప్రిన్స్ లను నామినేట్ చేస్తున్నట్టు సందీప్ చెప్పాడు. రతిక తన వస్తువులను, షూస్ ను సరిగ్గా ఉంచకపోడం తనకి నచ్చలేదని, అలాగే ప్రిన్స్ కిచెన్ లో ఎక్కువగా హెల్ప్ చెయ్యలేదని తన పేరు చెప్పానని తెలిపాడు. దీనికి రతిక ఏ మాత్రం కూడా ఏకీభవించలేదు. ఆ షూస్ తనవి కావని, వేరే ఎవరివో అని రతిక సందీప్ కి చెప్పాడని ట్రై చేసింది.

షకీలా నామినేషన్స్

షకీలా ప్రిన్స్, పల్లవి ప్రశాంత్ లను నామినేట్ చేసారు. తాను జోక్ గా అడిగిన దాన్ని అర్ధంచేసుకోకుండా ప్రిన్స్ తనని నామినేట్ చేసినందుకే ప్రిన్స్ పేరుని, అలాగే ప్రశాంత్ తో చాలా అపార్ధాలు వస్తున్నాయని అందుకే నామినేట్ చేస్తునట్టు తెలిపారు. ప్రిన్స్,ప్రశాంత్ ఇద్దరు బయటికి వాస్తు వెటకారంగా డాన్స్ చేస్కుంటూ వచ్చారు.

గౌతమ్ కృష్ణ నామినేషన్స్

శోభా శెట్టి, ప్రిన్స్ యావర్ లను గౌతమ్ నామినేట్ చేసాడు.ఇద్దరు కిచెన్ లో తక్కువ హెల్ప్ చేసినట్టు తనకు అనిపించింది అని కారణం గా చెప్పాడు. శోభా శెట్టి మల్లి ఈ విషయం లో గౌతమ్ తో చిన్నపాటి గొడవ పడింది. తాను పని చేసిన సరే ఎవరు గుర్తించలేదని శోభా చాలా బాధపడింది.

శుభశ్రీ నామినేషన్స్

రతిక, శోభా శెట్టి ని నామినేట్ చేసింది శుభశ్రీ. ఇద్దరితో తనిఖీ అంతగా కనెక్షన్ కుదరలేదని కారణం గా తెలిపింది. అంతే కాకా ఇద్దరు కూడా టాస్క్ లో అంతగా ఇంటరెస్ట్ చూపించలేదని, అందుకే వాళ్ళిద్దరిని నామినేట్ చేసినట్టు తెలిపింది. అందరూ శోభా శెట్టి ని నామినేట్ చేయడం తో ఏడ్చేసింది, అందరూ తననే టార్గెట్ చేస్తున్నారని ఫీల్ అయ్యింది.

ప్రశాంత్ నామినేషన్స్

షకీలా, కిరణ్ రాథోడ్ లను ప్రశాంత్ నామినేట్ చేసాడు. ఉన్న కంటెస్టెంట్స్ అందరిలో షకీలా వీక్ గా తనకు అనిపించారని ఆవిడ పేరు చెప్పినట్టు తెలిపాడు. అలాగే కిరణ్ రాథోడ్ సెన్సిటివ్ గా అనిపించారని కారణం చెప్పాడు. కిరణ్ రాథోడ్ మాత్రం దీనికి ఒప్పుకోలేదు. హౌస్ లోకి వచ్చిన తరువాత ఒక్కసారి కూడా తాను ఎమోషనల్ అవ్వలేదని స్పష్టం చేసింది.

అమర్ దీప్ నామినేషన్స్

రెస్ట్రిక్ట్డ్ ఏరియా(restricted area) అని రాసి ఉన్న సరే ప్రిన్స్ అందులోకి వెళ్లడం బిగ్ బాస్ హౌస్ రూల్స్ ని వ్యతిరేకించడం అని ప్రిన్స్ పేరు ని నామినేట్ చేసాడు అమర్ దీప్. అలాగే ఇద్దరు మధ్య అనవసరంగా గొడవపెట్టడానికి తేజ చూసినందుకు తేజ ని కూడా నామినేట్ చేస్తునట్టు అమర్ దీప్ చెప్పాడు.

కిరణ్ రాథోడ్ నామినేషన్స్

ప్రశాంత్, శోభా శెట్టి లను కిరణ్ రాథోడ్ నామినేట్ చేసింది. ప్రశాంత్ తో తనకి ఎలాంటి కనెక్షన్ కుదరట్లేదని, అలాగే ఉన్న కంటెస్టెంట్స్ అందరిలో శోభా శెట్టి వీక్ లా తనకి అనిపిస్తుంది అని వాళ్లిదరు పేర్లని నామినేట్ చేస్తున్నట్టు తెలిపింది.

తేజ నామినేషన్స్

తేజ ప్రశాంత్, కిరణ్ రాథోడ్ లను నామినేట్ చేస్తున్నట్టు తెలిపాడు. తేజ అడిగిన ప్రశ్నలకు ప్రశాంత్ తప్పుగా సమాధానాలు ఇస్తున్నట్టు, అది తనకి నచ్చలేదని నామినేట్ చేస్తునట్టు, అలాగే కిరణ్ రాథోడ్ కి తెలుగు రాకపోవడం తో ఇబ్బంది పడ్తున్నట్టు కారణం గా చెప్పాడు.

రతిక నామినేషన్స్

డీలక్స్ రూమ్ లోకి ఎవరికీ ఇంకా అనుమతి ఇవ్వలేదని, ఆయన సరే ప్రియాంక, దామిని రూమ్ లోకి వెళ్లి ఉన్నట్టు, అది రూల్స్ కి వ్యతిరేకంగా అనిపించింది అని వాళ్ళ పేర్లు చెప్పి నామినేట్ చేస్తున్నట్టు తెలిపింది.

బిగ్ బాస్ 7 వీక్ 1 నామినేషన్స్ – మిస్డ్ కాల్ వోటింగ్ నంబర్స్

కంటెస్టెంట్ పేరు మిస్డ్ కాల్ నెంబర్
దామిని8886676902
గౌతమ్ కృష్ణ8886676903
కిరణ్ రాథోడ్8886676904
పల్లవి ప్రశాంత్8886676905
ప్రిన్స్ యావర్8886676906
రతిక రోజ్8886676908
షకీలా8886676910
శోభా శెట్టి8886676911

బిగ్ బాస్ వోటింగ్ ఎలా వెయ్యాలి ?

బిగ్ బాస్ లో మీకు నచ్చిన కంటెస్టెంట్ కి హాట్ స్టార్ యాప్ లో వోట్ వెయ్యొచ్చు. ముందు సీజన్స్ లో కాకుండా ఈసారి ఒక అకౌంట్ నుంచి ఒకే వోట్ వెయ్యొచ్చు. అది కాకుండా మీ మొబైల్ నుంచి కంటెస్టెంట్ కి నిర్దేశించబడిన నెంబర్ కు కాల్ చేసి కూడా వోట్ చెయ్యొచ్చు. రోజుకి ఒకే మిస్డ్ కాల్ అవుతుంది ఒక నెంబర్ నుంచి.

బిగ్ బాస్ 7 ఎపిసోడ్ 3 డే 2 హైలైట్స్

Leave a Comment