బిగ్ బాస్ 7 ఎపిసోడ్ 4 తెలుగు హైలైట్స్ – 06/09/2023

Bigg Boss

bigg boss 7 episode 4 telugu highlights

డే 2 నామినేషన్స్ వల్ల కాస్త హీట్ తో ముగిసాక డే 3 మొత్తం టాస్క్ మీద ఫోకస్ చేసారు. ముందుగా హౌస్ మేట్స్ అందరికి హౌస్ లో ఉండే అర్హత ను సాధించేందుకు సిద్ధం కమ్మని ఆదేశించారు. ఇందులో వారిని పరీక్షించడానికి టాస్క్స్ ఉంటాయని అందులో ఎవరైతే గెలుస్తారో వల్లే ఈ షో లో ఉండడానికి అర్హులు అని స్పష్టం చేసారు.

కంటెస్టెంట్స్ కు బిగ్ బాస్ బంపర్ ఆఫర్

రాబోయే టాస్క్స్ కేవలం హౌస్ లో ఉండే అర్హత కోసమే కాదని ఆ టాస్క్స్ లో గెలిచినా వారికి మరికొన్ని లాభాలు ఉన్నాయని చెప్పారు. అదేంటంటే టాస్క్స్ లో గెలిచినా వారికి ఏకంగా ఐదు వారాలు ఇమ్మ్యూనిటి లభిస్తుంది. అంటే ఐదు వరాల వరకు నామినేషన్స్, మరియు ఎలిమినేషన్ నుంచి సేఫ్ అవ్వొచ్చు. కంటెస్టెంట్స్ అందరూ దీన్ని సీరియస్ గానే తీస్కున్నట్టు తెలుస్తుంది.

బిగ్ బాస్ 7 డే 3 హైలైట్స్

  • ప్రిన్స్ మరియు షకీలా వారి మధ్య వచ్చిన చిన్న అపరాధాన్ని సాల్వ్ చేస్కునే ప్రయత్నం చేసుకున్నారు.
  • హౌస్ లో మొదటి సారి కుక్కలు అరిచాయి. కిరణ్ రాథోడ్ డే టైం లో పడుకున్నందు వల్ల ఇలా జరిగింది.
  • రితిక, ప్రశాంత్ ట్రాక్ ను ఎక్స్టెండ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు బిగ్ బాస్. వాళ్ళు కూడా కావాలనే కంటెంట్ కోసం ఇలా చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఫేస్ ది బీస్ట్ టాస్క్( Face the Beast Task )

ఇమ్మ్యూనిటి పొందేందుకు, మరియు హౌస్ లో స్థానం కంఫర్మ్ చేసుకునేందుకు ఇచ్చే టాస్క్స్ లో మొదటిది ” ఫేస్ ది బీస్ట్ ” టాస్క్. ఇందులో భాగంగా కంటెస్టెంట్స్ బాడీ బిల్డర్స్ తో కుస్తీ పట్టాల్సి ఉంటుంది. ఆడ కంటెస్టెంట్స్ కు ఆగ బాడీ బిల్డర్, మరియు మెగా వారికీ మగబోడీ బిల్డర్ ని తీసుకొచ్చారు. ఎవరైతే ఎక్కువసేపు బయటికి రాకుండా లోనే ఉంటారో వాళ్లే విజేత.

టాస్క్ లో బిగ్ బాస్ సూపర్ ట్విస్ట్

దిట్టమైన శరీర ఆకృతితో ఉన్న బాడీ బిల్డర్స్ ని చూస్తేనే కంటెస్టెంట్స్ కు టెన్షన్ మొదలయ్యింది. ముందుగా రతిక ను తలపడవలసిందిగా బిగ్ బాస్ పిలిచారు. వెళ్లిన కొద్దిసేపటికే బయటికి వచ్చేసింది రతిక. తదుపరి అమర్ దీప్ ను పిలిచారు. తాను బయటికి రాకుండా ఎక్కువసేపు నిలువరించగలిగాడు. అయితే ఇక్కడే బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే అని అసలు కదా ముందు ఉందని తెలిపాడు.

ఫేస్ ది బీస్ట్ టాస్క్ లో కంటెస్టెంట్స్ పెర్ఫార్మన్స్

శాంపిల్ అయిపోయాక రియల్ టాస్క్ లో ముందుగా కిరణ్ రాథోడ్ ని పిలిచారు. ఆమె బాగానే ఆడి చాలాసేపు వరకు బాక్స్ లోనే ఉంది. ఒకరి తరువాత ఒకరిని బిగ్ బాస్ టాస్క్ కోసం పిలిచారు. కిరణ్ రాథోడ్, ప్రిన్స్, శుభశ్రీ, అమర్ దీప్, దామిని, షకీలా, గౌతమ్, శోభా శెట్టి, ప్రశాంత్, శివాజీ, రతిక, తేజ, ప్రియాంక, సందీప్… ఈ వరుసలో కంటెస్టెంట్స్ ని పిలవడం జరిగింది.

వచ్చిన అందహరిలో ఎక్కువగా ఫన్నీ గా తేజ, షకీలా చేసారు. అలాగే ఎక్కువసేపు ఆడింది ప్రియాంక, ప్రశాంత్,శోభా శెట్టి, సందీప్, తేజ. వీరిలో ఎవరో ఇద్దరు (1 మెగా, 1 ఆడ) గెలుస్తారని అందరి అంచనా.

బిగ్ బాస్ 7 ఎపిసోడ్ 4 ఫేస్ ది బీస్ట్ టాస్క్ విజేత

ముందుగా చెప్పిన విధంగానే 1 మగ,1 ఆడ కంటెస్టెంట్ ను బెస్ట్ పెరఫార్మెర్ గా గుర్తించి విజేతలు గా ప్రకటించారు. అందులో ప్రియాంక (67 సెకండ్స్), సందీప్ (109 సెకండ్స్) అందరికంటే ఎక్కువసేపు ఉంది విజేతలు గా నిలిచారు. హౌస్ లో జరిగిన మొదటి టాస్క్ లో గెలిచినందుకు సందీప్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఇంతటితో ఇమ్మ్యూనిటి వచేయలేదు, ఇంకా టాస్క్స్ చెయ్యాల్సి ఉంది.

పల్లవి ప్రశాంత్ సింపతీ ప్లాన్ బయట పెట్టిన అమర్ దీప్

ఎపిసోడ్ పూర్తి అయ్యే ముందే అమర్ దీప్ ప్రశాంత్ సింపతీ ప్లాన్ కోసం సందీప్ కి చెప్పాడు. బ్లాంకెట్, బెడ్ ఇచ్చిన సరే తీసుకోకుండా ప్రశాంత్ కిందే పడుకోవడం తో చూసే ప్రేక్షకులకు మనం తప్పుగా కనిపిస్తున్నామని, అది చాలా తప్పు దారిలో వెళ్తుంది అని చెప్పాడు.దీనికి షకీలా, సందీప్ కూడా ఏకీవభించారు.

బిగ్ బాస్ లో మీకు నచ్చిన కంటెస్టెంట్ కు Hotstar లో వోట్ చెయ్యడం మర్చిపోకండి. అన్ని ఎపిసోడ్స్ ని ఫ్రీ గా కూడా చూడొచ్చు.

బిగ్ బాస్ 7 ఎపిసోడ్ 2 హైలైట్స్

బిగ్ బాస్ 7 ఎపిసోడ్ 3 హైలైట్స్

Leave a Comment